వివాహ లగ్నము – వైవాహిక జీవితం

వివాహము జరిపించే ప్రక్రియలో వరుడు లేదా వధువు ఇరువురి జన్మ కుండలి లెక్కింపు చేయుట ఒక పద్దతి ఉంది. వీటిలో కుజ దోశం, జన్మ రాశి, నక్షత్రం ఆధారంగా 36 గుణముల లెక్కింపు చేసెదరు. 18 కన్నా అధిక గుణములు కలిస్తే గనక ఇరువురి కుండలి వివాహమునకు ఉపయుక్తముగా చెప్పబడుతుంది.
కుండలి లెక్కింపు చేయడంలో సంపూర్ణ ద్యానము నక్షత్రముపైనే కేంద్రీకరించి ఉండును. జన్మ నక్షత్రం యొక్క పూర్ణ రూపములో అవహేలనగా వుండును, వర్ణము, యోని, నాడి ఇత్యాది ఆదారము నక్షత్రములుగా వుండును. వీటన్నింటిలోను ఒక ముఖ్య విషయం.. వైశ్య జాతి వారి కుండలి ఇది ఒక దోషం.. అలాగే బ్రహ్మణ జాతి వారి కుండలిలో ఇది రెండవ దోషం నాడి గా ఉండును.
నిజానికి మానవులపై అన్నింటి కన్నా అధిక ప్రభావము నవగ్రహముల వల్ల కలుగును. ఈ పరిస్థితిలో కుజుని ఉదాహరణ.. కుండలి యొక్క 1, 4, 7, 8, 12 భావములలో కుజుడు ఉంటే గనక వారు కుజ దోష యుక్తులు కాగలరు. కుజునికి సాహసం, శక్తి, బలం, ఆస్థి పాస్తులు, తమ్ముడు ఇత్యాదులకు కారకముగా చెప్పబడుతున్నది. పైన చెప్పిన 5 భావములలో మూడు కేంద్ర స్థానములుగా చెప్పబడుతున్నాయి. ఇంకా ఫలిత జ్యోతిష్య ఆధారముగా సౌమ్య / శుభ గ్రహము (చంద్ర, బుధ, గురు, శుక్ర) కేంద్ర స్థానములో ఉండిన దోషకారకులుగా ఉండును. కాని క్రూర గ్రహము (సూర్య, కుజ, శని మరియు రాహువు) కేంద్ర స్థానములో ఉంటే శుభ ఫలదాయిగా ఉంటుంది. ఈ విధముగా రెండు విరోదాత్మక విషయములు ఎదురవుతుండును. కుజ గ్రహము బలహీనముగా ఉంటే గనక కుండలి లెక్కింపు ఉత్తమముగా ఉండును. శని సప్తమ బావములో దృష్టి వలన వివాహం ఆలస్యముగా జరుగుట లేదా రెండు వివాహములు జరుగు యోగమును కలిగించును.
కుండలిలో స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితమును సుఖమయంగాను, లేదా కలహపూర్ణముగాను చేయగలదు. కాని ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే గనక వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా లెక్కిస్తారు. దీని ప్రకారము వివాహ సమయములో శుభ లగ్నము, మహాత్యము కలిగి ఉండును.
జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో వుండును. వివాహము కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని పరీక్షణ చేసి వివాహ లగ్నమును నిశ్చయించవలెను. యది కుండలి లేకపోతే గనక వరుడు మరియు కన్య యొక్క పేరులో వున్న రాశికి అనుగుణంగా లగ్నమును విచారించవలెను.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నము.. అశుభ ఫలదాయకముగా ఉండును. అనగా ఈ లగ్నములో వివాహము గురించి ఆలోచించరాదు.జన్మ లగ్నము మరియు జన్మ రాశి నుంచి 4వ, 12వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టముగా ఉంటే గనక ఈ లగ్నములో వివాహము సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నములో వివాహము దోషపూరితముగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నము నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషము కలుగదు. కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉన్న ఎడల వివాహ లగ్నములో అనేక విధములైన దోషములు.. దగ్ధతిధి, గుడ్డి, చెవుడు వంటివి కలుగును. వివాహా లగ్నము లెక్కించు సమయములో రాహువు శనికి సరిసమమైన ప్రబావకారిగా వుండును మరియు కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *