ఓయూ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి

హైద‌రాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున ఉన్నఉస్మానియా యూనివ‌ర్శీటీ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఓ.యూ వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌లను కోరారు. ఏఐఎస్‌ఎఫ్ ఓ.యూ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ ఓ.యూ కార్యదర్శి ఆర్ ఎల్ మూర్తి, పిడిఎస్‌యు నాయకులు దుబ్బ రంజిత్, గడ్డం శ్యామ్‌లు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, లీజు భూములపై సమీక్షించి.. లీజు పూర్తయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓ.యూ భూములు కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్టేట్ సెల్ డైరెక్టర్ పై ఉందన్నారు. ఇప్పటికైనా ఓ.యూ భూములను కాపాడుకోవడం కోసం సరైన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరారు. లేనిపక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఓ.యూ భూముల పరిరక్షణ ఉద్యమం చేప‌డ‌తామ‌ని వారు హెచ్చరించారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *