ఎవరోస్తారు… ఎవరు గట్టెకిస్తారు..!

ఎవరోస్తారు… ఎవరు గట్టెకిస్తారు..!

ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి పార్టీ వర్గాలు సభలు ప్రచారాలతో జోరు మీదా ఉన్నాయి. ఈ పార్టీ వారు ఆ పార్టీ లోకి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి అన్నట్టుగా మారింది. ఎం‌ఎల్‌సి లు ఎమ్మెల్యే లు గా మారుతున్నారు. విబిన్న వర్గాల నుండి వేర్వేరు నియోజకవర్గాలనుండి పోటీ కి సిద్ధమవుతున్నారు. ప్రతి పార్టీ వారు దాదాపుగా నియోజకావర్గానికి ఒకరిని నియామకాలు చేస్తున్నారు. ఏ నియోజకవర్గాన్ని చూసిన పోటీ ధీటుగా ఉండేట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉండగా జనసేన పార్టీ లో మాత్రం అంతా జోరు కనపడట్లేదు. కేవలం జనసేనాని పవన్, నాదెండ్ల మనోహర వీరు మాత్రమే ఎక్కువగా ప్రసంగాలలో సభలలో కనిపిస్తున్నారు. Read more about ఎవరోస్తారు… ఎవరు గట్టెకిస్తారు..!

తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం

చెన్నై విమానాశ్రయంలో ఓ విమానంకు పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో ఎయిర్‌ లంక విమానం టైర్‌ పేలింది. పెద్ద శబ్ధం రావడంతో విమానంలోని ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌ లంక విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్‌ చేశారు. ఈ విమానంలో మొత్తం 142 మంది ప్రయాణికులున్నారు. వారంతా క్షేమంగా బయటప‌డ్డారు. Read more about తప్పిన ప్రమాదం

బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. భారతీయ సంస్కృతి

బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. భారతీయ సంస్కృతి- వై‌ఎస్ జగన్

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదని, భారతీయ సంస్కృతని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. బీసీలంటే వెనుకబడ్డ కులాలు కాదని.. మన జాతికి వెన్నుముకలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో ఆయన ఆశేష బీసీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘బలహీన వర్గాల అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను చూస్తా ఉంటే.. ఈ రోజు నిజంగా కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా ఉంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మార్పులను కోరుతూ ఈ రోజు బీసీ గర్జనను నిర్వహించుకుంటున్నాం. Read more about బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. భారతీయ సంస్కృతి- వై‌ఎస్ జగన్

క్లారిటీ ఇచ్చిన గంటా

క్లారిటీ ఇచ్చిన గంటా

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయ‌న‌ కోరారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ వుదంతాల‌పై క్లారిటీ ఇచ్చారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తారా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని విలేక‌రులు అడగ‌గాఅది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అసలు ఈసారి పోటీ చేయవద్దని చెప్పినా మానేస్తానన్నారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనన్న గంటా.. బీసీ గర్జన నిర్వహించడానికి జగన్‌ అనర్హుడని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా నియమించని జగన్‌..ఇప్పుడు బీసీల పేరుతో హడావిడి చేయడం హాస్యాస్పదమని అన్నారు. Read more about క్లారిటీ ఇచ్చిన గంటా

సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. ఈ విషయమై ఇదివరకే అధికారికంగా ప్రకటన కూడా వెల్లడైంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం మాట్లాడినట్టు దానికి గాను చంద్రబాబు ఒప్పుకునట్టు తెలుస్తుంది. Read more about సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాటు చేస్తున్నార‌ని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏలూరులో వైసీపీ నిర్వహించిన‌ బీసీ గర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, నాలుగున్న‌రేళ్ళుగా చంద్రబాబుకు బీసీలు గుర్తురాలేదని, ఇప్పుడేందుకు వారు గుర్తొచ్చారని విమర్శించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ ఎన్నికల వేళ ఉన్న‌ట్టుంది చంద్ర‌బాబుకు బీసీలు గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఆయ‌న మాయ మాట‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. జగన్ తన పాదయాత్రలో ప‌జ‌ల సమస్యలను గుర్తించార‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరాలంటే, రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఇక త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే అన్ని రంగాల్లో బీసీలు ఎదిగేలా బీసీ డిక్లరేషన్ ఉంటుందని అన్నారు. Read more about ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబువి

శబాష్..అన్షుల్ సక్సేనా..!

శబాష్..అన్షుల్ సక్సేనా..!

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 44 మంది జవాన్లు అమరులు కావడంతో.. దేశం లోని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ప్రతి ఒక్కరికికి కడుపు మరిగిపోతుంది. ప్రధాని మోది కూడా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ని ప్రకటించాడు. ఇలా మరిగిపోతున్నాడు మన దేశానికి చెందిన ఒక వెబ్ హ్యాకర్ అతడే అన్షుల్ సక్సేనా. Read more about శబాష్..అన్షుల్ సక్సేనా..!

టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపి ప్రభుత్వం టి.టి.డి పాలక మండలి సభ్యుడిగా తిరిగి నియమించినా, ఆయన నిర్దేశించిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తిరిగి తెలంగాణ ప్రాంతం నుండి మ‌రొక‌రికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిది. దీంతో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియ‌జేసింది. Read more about టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు

Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter