కారణం ఒకటి చికిత్స మరొకటి.. వ్యాది ఒకటి వైద్యం మరొకటి.. వైద్యం కోసం వచ్చిన బాదితులకి సరైన వైద్యం చేస్తున్నారా..? సరైయన్ పరిశీలన చేస్తున్నారా..? అవును ఇలాగే ఉంది నేటి ఆస్పత్రిల, డాక్టర్ల పరిస్తితి. వైద్యం కోసం వచ్చిన రోగుల్నీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇది డాక్టర్ల వైఫల్యం నిర్లక్షం అనే చెప్పాలి. రోగి వచ్చిన కారణం ఒకటైతే వారికి అందుతున్న వైద్యం మరొకటి అనట్టుగా మారిన వైనం.
తాజాగా ఒడిశాలోని కియోంఝర్ జిల్లా పరిథిలోని ఖాబిల్ గ్రామానికి చెందిన మితారాణి జేనా అనే మహిళ ప్రమాదవశాత్తూ కింద పడడంతో ఆమె ఎడమకాలికి గాయం అయింది. దీంతో ఖాబిల్ గ్రామానికి దగ్గర్లోని ఆనంద్పూర్ ప్రభుత్వాసుప్రతికి వెళ్లింది. అయితే బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. వెంటనే ఆమెను ఆపరేషన్ గదికి తీసుకెళ్లారు.అనంతరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎడమకాలుకు చేయాల్సిన ఆపరేషన్ కుడికాలికి చేశారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. ఇప్పుడు జేన నడవలేకపోతుంది. దీంతో ఆందోళనకి గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.
The post వ్యాది ఒకటి.. వైద్యం మరొకటి..! appeared first on MahaaNews.