బాలికను చంపి రక్తం తాగిన మేనత్త…!

రాక్షసులు.. దెయ్యం.. ఈ పదాలు వినగానే మనకు చమటలు పడతాయి. వీళ్ళు రక్తం తాగుతారని విన్నాం.. అప్పుడప్పుడు సినిమాలు, సీరియల్స్ లో కూడా చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ చూస్తున్నాం. అవును మనుషుల మధ్య, మనతోనే తిరుగుతున్న ఓ మహిళ.. ఆరేళ్ల బాలికను కిరాతకంగా చంపేసింది. ఆ తర్వాత తీరిగ్గా రక్తం తాగింది. వినటానికే ఒళ్లు జలదరిస్తోంది కదూ.. ఇలాంటి మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది కదా.. నిజంగా ఉన్నారని చెబుతోంది ఏపీ రాష్ట్రం విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన.

విశాఖ జిల్లా పెదబయలు మండలం లకేయుపుట్ట అటవీ ప్రాంతం. అనూష అనే బాలిక ఉంది. ఈ చిన్నారికి వంతల రష్మో అనే మేనత్త ఉంది. ఆమె తన భర్తతో కలిసి కట్టెల కోసమని చెప్పి కొండపైకి బాలిక అనూషను తీసుకెళ్లింది. అక్కడ బాలికను నరికి చంపింది. ఆ తర్వాత రక్తం తాగింది. బాలిక కనిపించకపోవటంతో గ్రామస్తులంతా కొండల్లో వెతికారు. మృతదేహాన్ని చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఆరా తీశారు. బాలిక మేనత్త వంతల రష్మోను చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. నిందితురాలు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులోనే ఇలా చేసిందా.. కుటుంబ కలహాలమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

The post బాలికను చంపి రక్తం తాగిన మేనత్త…! appeared first on MahaaNews.

Go to Mahaa News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *