జలవిహార్‌లో కెసిఆర్ బర్త్‌డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఈ నెల 17వ తేదీన ఆదివారం హైద‌రాబాద్ లోని జలవిహార్‌లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, శాసన సభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వెల్లడించారు. జలవిహార్ లోజరుగుతున్నజన్మదిన వేడుకల వేదిక ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనె 17వ తేదీన ఉదయం 9గం.లకు సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గణపతి హోమం, ఆయుష్ హోమం, ఛండీ హోమంలు నిర్వహిస్తున్నామని వివరించారు. చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అనంతరం పద్మారావు నగర్ డివిజన్‌లోని హమాలీబస్తీలో హెల్త్ క్యాంప్ నిర్విహిస్తామని ఆయన తెలిపారు. జలవిహార్ లో తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా గుస్సాడీ, కొమ్మకోయ, లంబాడీ, కోయ, చిందు, యక్షగానం, కోలాటాలు తదితర కళాకారుల తో వివిద సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు జానపద గీతాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలైన‌ రైతు బంధు, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, తదితర పథకాలను వివరించే స్టాల్స్‌ను జలవిహార్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిపే రెండు అద్భుత గీతాలు ఆవిష్కరించడం జరుగుతుంది అని అన్నారు. ఇవేకాకుండా కేసీఆర్ విద్యార్ధిదశ నుంచి ఉద్యమ నేతృత్వం వరకు జీవిత నేపద్యాన్ని తెలియజేసేలా భారీ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 4 సం.ల 3నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంను అగ్రభాగాన నిలిపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినాన్ని కోలాహలంగా, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని అన్నారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాక రామారావు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కల్వకుంట్ల కవిత, ముఖ్య నాయకులు హరీష్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని టీఆర్‌ఎస్ ఎం.పీలు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సిలు, కార్పొరేటర్‌లు, టిఆర్‌ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్య లో హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయ సెక్రెటరీ రమేష్, మనం సైతం కాదంబరి కిరణ్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుర్రం పవన్ కుమార్‌గౌడ్, సామా ప్రభాకర్‌రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, బాబురావు, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *