క్షమాపణ చెప్పండి..పార్లమెంట్‌లో ప్రకటన చేయండని..!

ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్నా అన్యాయానికి ఏపిప సి‌ఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు. వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని ఆయన కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్టం రాష్ట్రం పై కక్ష చూపుతున్నారని ఆయన ఈరోజు దీక్షా చేపట్టారు. ఏపీ భవన్ ప్రాంగణంలో ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష ప్రారంభించారు. అంతకుముంద ఆయన రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈరోజు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది.

చంద్రబాబు మాట్లాడుతూ ‘మేం ఇక్కడ ఆందోళన చేస్తోంది హక్కుల కోసమని, భిక్షం కోసం కాదని అన్నారు. ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే తమ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

’తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మోదీకి గట్టిగా బుద్ధి చెబుతాం. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. గుంటూరులో ఆదివారం జరిగిన సభలో మోదీ నాపై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. పెండింగ్‌లో ఉన్న విభజన హామీలేమైనా ప్రకటిస్తారేమోనని అందరూ ఆశగా చూస్తే నిరాశపరిచారు. అధికారం నెత్తికెక్కిన మోదీని త్వరలో ప్రజలే గద్దె దించుతారు. ప్రజలపై ప్రేమ లేని మోదీకి పరిపాలించే అర్హత లేదు. నవ్యాంధ్రకు న్యాయం చేయకపోతే ఏపీలో బీజేపీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోతుంది. విభజన హామీలు నెరవేర్చని వారికి తెలుగు గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతున్నారు. చెప్పడానికి మేం సిద్ధం. కానీ మేం కట్టిన పన్నులకు లెక్కలు మీరు చెప్పగలరా?. ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామని చెప్పి కేవలం రూ.1,500కోట్లే ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఇలా అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతూ.. ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. మోదీకి పాలించే అర్హత లేదన్నారు చంద్రబాబు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటివరకు విభజన గాయం మానలేదన్నారు. మూడురోజుల సమయం ఉంది… ఇప్పటివరకు చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి… పార్లమెంట్‌లో ప్రకటన చేయండని సూచించారు. లేదంటే ఏపీ ప్రజలు శాశ్వతంగా బీజేపీని బహిష్కరించే పరిస్థితి వస్తుందన్నారు.

The post క్షమాపణ చెప్పండి..పార్లమెంట్‌లో ప్రకటన చేయండని..! appeared first on MahaaNews.

Go to Mahaa News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *