29249114_1629577880472147_2929795624385642496_n

అదృష్ట సంఖ్యలు – మంచి రోజులు

మానవుడికి కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఉంటాయి. వివిధ రాశుల్లో జన్మించిన జాతకులు అదృష్ట సంఖ్యలు, మంచి రోజులను బట్టి కార్యాచరణ చేయడం ఉత్తమమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అదృష్ట సంఖ్యల్లో వాహనాలు కొనడం, రాశికి అనుగుణమైన రోజున శుభకార్యాన్ని మొదలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి.
సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట రెండు విధములు. అందులో ఒకటి.. వారివారి జన్మ తేదీని బట్టి ఫలితములు తెలుసుకొనుట. రెండవది జన్మ తేదీ లేకపోతే వారి పేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం తెలుసుకోవడం.
సంఖ్యలకు గ్రహాల నిర్ణయం
1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ
ఇంగ్లీషు అక్షరములకు అంకెలు
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 9 8 7 6 5 1 1 2 3 5 7 8 1 2 3 4 6 6 6 5 1 7
దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితాలను, మిగిలిన విషయములో సులభంగా తెలిసుకొవచ్చు. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలుసుకోవాలి. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.
ఉదా: RAJU
2116
2+1+1+6=10, (1+0) = 1 (అంటే రాజు అనే వ్యక్తికి 1 వస్తుంది. 1వ సంఖ్య వారు 1 సంఖ్య అధిపతి రవి. ఏ మాసములోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్ట రోజులు అవి.. 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును. వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్ట రోజులు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, ఇంకా.. 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు ఇంకా.. ఆ సంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించాలి. 2వ సంఖ్య వారు ఏ మాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు. ఇంకా రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి.
వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించాలి. 3వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 3, 12, 21, 30 తేదీలు అయితే ఇంకాను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించాలి. 4వ సంఖ్య వారు ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా.. అదృష్ట సంఖ్య 4 అవుతుంది. వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయితే ఇంకను విశేష శుభ ప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడా శుభప్రదములు.
వీరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదీలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అనే రత్నము ధరించాలి. 5వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్ట రోజులు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ రోజుల విశేష అదృష్ట దినములగును. వీరు ఉంగరములో పచ్చ ధరించడం మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.
6వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్ట దినములగును. వీరు వజ్రం ధరించడం మంచిది.
7వ సంఖ్యవారు ఏ మాసంలోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గల వారితో సర్వవిషయములందును పొత్తుగా కుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి ఉన్నచో వ్యాపారము చేసి ధన సంపాదన చేయడంలో శక్తి యుక్తుల గలవారై ఉంటారు. వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యంగా ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యం ధరించడం మంచిది.
8వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్ట సంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందువల్ల ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట శుభకరం. అదృష్ట తేదీలు 8, 17, 26. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడా అనుకూలమైన దినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించడం మంచిది. నూతన వ్యాపారము కూడా ఈ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు 9వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజ వ్యక్తులు. వీరు తరచుగా సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్రవారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడం ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9తో గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మళ్లీ 9 వచ్చును. 12×9 = 108 మళ్లీ ఈ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేస్తే 9 వచ్చును. Read more about అదృష్ట సంఖ్యలు – మంచి రోజులు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

మేషరాశి : అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృషభరాశి: అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.
మిధునరాశి: అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.
కర్కాటక రాశి: అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.
సింహరాశి : అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.
కన్యారాశి : అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.
తులారాశి: అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి: అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.
ధనుస్సురాశి: అదృష్ట సంఖ్యలు 1, 2, 4, 5. ఆది, బుధ, గురు వారాలు వీరికి కలసివస్తాయి.
మకరరాశి: అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి. Read more about రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు – శుభ దినాలు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

చంద్రగ్రహ శాంతికి ఏం చేయాలో తెలుసా..!?

చంద్రుడు గౌరవర్ణం కలవాడు. చంద్రుని వస్త్రము, అశ్వము, రథము శ్వేత వర్ణములే. స్వర్ణమకుటము, ముత్యాలహారము ధరిస్తాడు. హస్తగధాయుధుడు. మరో హస్తమున వరముద్రను కలిగియుండును. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, పురుషస్వరూపుడని అందురు.
శ్రీ కృష్ణభగవానుడు జన్మించకముందే జన్మించినవాడు. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడందురు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించియుంటాడు. అత్రి మహర్హి, అనసూయలపుత్రుడు. సర్వమయుడు. బీజ, ఓషధి జలపూరుడు. అశ్విని, భరణి 27మందిని వివాహమాడెను.
వీరు నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మములను పాలిస్తూ… వర్షములను, మాసములను విభజించుచుందురు. పూర్ణిమనాడు చంద్రోదయ సమయమున రాగి పాత్రయందు తేనెకలిపిన పాయసమును వండి, చంద్రునికి సమర్పించిన యెడల శుభపద్రములు జరుగును.
ఇతని వాహనమైన రథములో మూడు చక్రములు మాత్రమే ఉండును. పది అశ్వములు ఇతని రథమున చోటుచేసుకుని వుంటుంది. అశ్వములు దివ్యమైనవి. అశ్వముల నేత్రములు కూడా శ్వేత వర్ణమును కలిగియుండును. మత్స్యపురాణమును పోలిన కంఠమును చంద్రుడు కలిగియుంటాడు.
చంద్రునికి బుధుడు అనేపుత్రుడు కలడు. ఇతడు తారకకు జన్మించిన వాడు. చంద్రునికి అధిదేవత, ప్రత్యధిదేవత గౌరీదేవి. చంద్రుని మహాదశకాలము పది సంవత్సరాలు. చంద్రుడు కర్కాటక రాశి నాథుడు. నక్షత్రములకు స్వామి నాథుడు. నవగ్రహములలో రెండవస్థానానికి చెందిన వాడు. చంద్రశాంతికి సోమవార వ్రతము చేయటం మంచిది.
ఇంకా శివోపాసనం, శివస్తుతి చేయవలెను. వెండి, శంఖము, వంశపాత్ర, తెల్లని చందనము, శెనగలు, శ్వేతపుష్పములు పెరుగు, ముత్యాలు ఎద్దులకు దానమివ్వాలి. ఎద్దును బ్రాహ్మణునికి దానమివ్వడం ద్వారా చంద్రగ్రహ ప్రభావంతో కలిగే దుష్ఫలితాలు దరి చేరవని శాస్త్రం చెబుతోంది. Read more about చంద్రగ్రహ శాంతికి ఏం చేయాలో తెలుసా..!?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

గత జన్మ పాపాలు – నేటి ఖర్మలు

ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.
కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.
మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.
మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.
గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.
సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.
గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.
గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.
గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.
గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?
పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.
అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి. Read more about గత జన్మ పాపాలు – నేటి ఖర్మలు

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

మనకి” అష్టమూర్తి తత్త్వము” అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు, సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. Read more about అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

పెనుగొండ

హిందూపురానికి 20కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశంలో విజయనగర రాజులచే నిర్మించబడిన కోట ఉంది.బాబయ్య దుర్గా దగ్గర జరిగే ఉరుసు ఉత్సవం కూడా ప్రాచుర్యం పొందినదే.గ్రామమందు అనేక దేవాలయాలు,కొండపై కోట చూడతగ్గవి.అనంతపురం నుండి 70కి.మీ. దూరంలో పెనుగొండ ఉంది.విజయనగర సామ్రాజ్య ప్రారంభ దశలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారట.అనంతర కాలంలో విజయనగర ప్రభువులు వేసవి విడిదిగా ఉపయోగించినారు.ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూడవలసినది పెనుగొండ ఫారెస్ట్,జె.పి. ప్యాలెస్.ఇంకొక ముఖ్యమైన ఆకర్షణ కుంభకర్ణుడి తోట. ఈ తోట పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణం కలిగి మన మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.ఈ తోటలో 142 అడుగుల పొడవు,32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో వుంటుంది. Read more about పెనుగొండ

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

కేరళ – పరశురామ సృష్టా?

భారత దేశంలోని ఎన్నో ప్రాంతాలకు చాలా ప్రాచీన, దివ్య చరిత్ర ఉంది. కొన్నిటికి పురాణేతిహాసాల్లో ప్రస్తావన ఉంటే, కొన్ని చారిత్రికంగా ఏర్పడ్డాయి. అలా ఒక అద్భుతమైన చరిత్రతో కూడుకున్న ప్రాంతం కేరళ. Read more about కేరళ – పరశురామ సృష్టా?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

పోలి పాడ్యమి రోజున ఏమి చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా?

మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసం ఎంతోపవిత్రంగా భావిస్తారు. వేకువఝామున లేవడం,నదీలోనో చెరువులోనో లేదా ఇంటిదగ్గరో చన్నీటి స్నానం చేయడం,నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు. శివాలయాల్లో దీపారాధన , అభిషేకాలు, పూజలు చేస్తారు. అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యమి ఒక ఎత్తు అంటారు. కార్తీకం నెల్లాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో,మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేసే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెబుతారు. అయితే ఆరోజు పూజా విధానం ఎలా చేయాలనే దానిపై ఎవరి రీతిలో వారు చెబుతుంటారు. అయితే అసలు ఏం Read more about పోలి పాడ్యమి రోజున ఏమి చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

అనంతపద్మనాభ వ్రతం || Anantha Padmanabha Vratham

శ్రీకృష్ణ భగవానుడు అనంత పద్మనాభ వ్రతాన్ని ధర్మరాజుకు వినిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుక్ల చతుర్ధశి నాడు శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం…
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter