దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు?

దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు?

‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అంద..
అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్య కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు జాత‌కుడిని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. Read more about అందరూ వెళ్లగలరా..? అవకాశాలు లభిస్తున్నాయ..?

Please like and share us:
29249114_1629577880472147_2929795624385642496_n

విదేశీయానం.. ఎవ‌రికి.. ఎప్పుడు ఎలా?

టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాల..
29249114_1629577880472147_2929795624385642496_n

గర్భవతులు: వాస్తు, పూజలు, వ్రతాలు

మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి, మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొంతుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంట..
కలలు వాటి ఫ‌లితాలు

కలలు – వాటి ఫ‌లితాలు

నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు… ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు…
బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము. Read more about బ్రహ్మముహూర్తం..పురాణగాథ..ఏం చేయాలి..?

Please like and share us:
వివాహ లగ్నము – వైవాహిక జీవితం

వివాహ లగ్నము – వైవాహిక జీవితం

వివాహము జరిపించే ప్రక్రియలో వరుడు లేదా వధువు ఇరువురి జన్మ కుండలి లెక్కింపు చేయుట ఒక పద్దతి ఉంది. వీటిలో కుజ దోశం, జన్మ రాశి, నక్షత్రం ఆధారంగా 36 గుణముల లెక్కింపు చేసెదరు. 18 కన్నా అధిక గుణములు కలిస్తే గనక ఇరువురి కుండలి వివాహమునకు ఉపయుక్తముగా చెప్పబడుతుంది.
కుండలి లెక్కింపు చేయడంలో సంపూర్ణ ద్యానము నక్షత్రముపైనే కేంద్రీకరించి ఉండును. జన్మ నక్షత్రం యొక్క పూర్ణ రూపములో అవహేలనగా వుండును, వర్ణము, యోని, నాడి ఇత్యాది ఆదారము నక్షత్రములుగా వుండును. వీటన్నింటిలోను ఒక ముఖ్య విషయం.. వైశ్య జాతి వారి కుండలి ఇది ఒక దోషం.. అలాగే బ్రహ్మణ జాతి వారి కుండలిలో ఇది రెండవ దోషం నాడి గా ఉండును.
నిజానికి మానవులపై అన్నింటి కన్నా అధిక ప్రభావము నవగ్రహముల వల్ల కలుగును. ఈ పరిస్థితిలో కుజుని ఉదాహరణ.. కుండలి యొక్క 1, 4, 7, 8, 12 భావములలో కుజుడు ఉంటే గనక వారు కుజ దోష యుక్తులు కాగలరు. కుజునికి సాహసం, శక్తి, బలం, ఆస్థి పాస్తులు, తమ్ముడు ఇత్యాదులకు కారకముగా చెప్పబడుతున్నది. పైన చెప్పిన 5 భావములలో మూడు కేంద్ర స్థానములుగా చెప్పబడుతున్నాయి. ఇంకా ఫలిత జ్యోతిష్య ఆధారముగా సౌమ్య / శుభ గ్రహము (చంద్ర, బుధ, గురు, శుక్ర) కేంద్ర స్థానములో ఉండిన దోషకారకులుగా ఉండును. కాని క్రూర గ్రహము (సూర్య, కుజ, శని మరియు రాహువు) కేంద్ర స్థానములో ఉంటే శుభ ఫలదాయిగా ఉంటుంది. ఈ విధముగా రెండు విరోదాత్మక విషయములు ఎదురవుతుండును. కుజ గ్రహము బలహీనముగా ఉంటే గనక కుండలి లెక్కింపు ఉత్తమముగా ఉండును. శని సప్తమ బావములో దృష్టి వలన వివాహం ఆలస్యముగా జరుగుట లేదా రెండు వివాహములు జరుగు యోగమును కలిగించును.
కుండలిలో స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితమును సుఖమయంగాను, లేదా కలహపూర్ణముగాను చేయగలదు. కాని ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే గనక వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా లెక్కిస్తారు. దీని ప్రకారము వివాహ సమయములో శుభ లగ్నము, మహాత్యము కలిగి ఉండును.
జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో వుండును. వివాహము కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని పరీక్షణ చేసి వివాహ లగ్నమును నిశ్చయించవలెను. యది కుండలి లేకపోతే గనక వరుడు మరియు కన్య యొక్క పేరులో వున్న రాశికి అనుగుణంగా లగ్నమును విచారించవలెను.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నము.. అశుభ ఫలదాయకముగా ఉండును. అనగా ఈ లగ్నములో వివాహము గురించి ఆలోచించరాదు.జన్మ లగ్నము మరియు జన్మ రాశి నుంచి 4వ, 12వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టముగా ఉంటే గనక ఈ లగ్నములో వివాహము సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నములో వివాహము దోషపూరితముగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నము నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషము కలుగదు. కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉన్న ఎడల వివాహ లగ్నములో అనేక విధములైన దోషములు.. దగ్ధతిధి, గుడ్డి, చెవుడు వంటివి కలుగును. వివాహా లగ్నము లెక్కించు సమయములో రాహువు శనికి సరిసమమైన ప్రబావకారిగా వుండును మరియు కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది. Read more about వివాహ లగ్నము – వైవాహిక జీవితం

Please like and share us:
ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం

ప్రమాదల నుంచి రక్షించే మహామంత్రం

మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ భస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం…
రథ సప్తమి విశిష్టత

రథ సప్తమి విశిష్టత

‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్య భగవానున్ని ఆరాదించే పండుగ ‘రథ సప్తమి’. చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులు వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మ సాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తారు.
చలికాలము చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. ‘రథసప్తమి’ పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పండగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి. రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ.
శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసు.. అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది.
ఈ ‘రథ సప్తమి’ రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడ వాహన, పెదసేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు.
ఏడు జన్మల పాపాలు నశిస్తాయి
రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి.
ఇక స్నానానంతరం.. ‘జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే.. సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే’… అంటూ శ్లోకం చదివి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి.
ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసముండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి.
ఈ పర్వదినాన బంగారము గాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందులో ఎరుపు రంగు ఉండే సూర్యుని ప్రతిమను ఉంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసం ఉండి.. సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతముతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని శాస్త్ర ప్రబోధము.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం..
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం..
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం..
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం..
వినతాతనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః..
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణోమే ప్రసీదతు..
ఆదిత్యశ్య నమస్కారం యే కుర్వంతి దినే దినే..
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
ఆ ప్రత్యక్ష భగవానుడి ఆశీర్వాదంతో.. అనుగ్రహంతో అందరూ సదా సర్వదా ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటూ… ముందుగా అందరికీ రథ సప్తమి పర్వదిన శుభాకాంక్షలు. Read more about రథ సప్తమి విశిష్టత

Please like and share us:
రథసప్తమికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది?

రథసప్తమికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది?

మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం…
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter