మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

బాబుతో భేటీ అనంతరం మీడియాకు నమస్కారంతో సరి మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్సీ..! Read more about మాట్లాడకుండానే వెళ్లిపోయిన మాగుంట..

Please like and share us:
రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె ఏ పాల్ తో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ప్రెస్ మీట్ సంధర్భంగా పాల్ మాట్లాడుతూ ఇలా అన్నారు. Read more about రాజకీయాల్లోకి అందుకే వచ్చా..!

Please like and share us:
50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 44 మంది జవాన్ల ప్రాణాలు ఊరికేనే పోనివ్వమంటు ప్రధాని మోది చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోసారి సుర్జికల్ స్ట్రైక్ కి ధారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దేశమే ఇలా ఉంటే జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సముద్రం నుండి బయటపడనటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాం అని తిరిగేల్లిన జవాన్లు తిరిగి శవాలుగా ముక్కలుగా ఇళ్ళకి వచ్చారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. అమరుల కుటుంబాలని ఆదుకునే దిశగా దేశ నాయకులంతా తమ కృషికి తగ్గ విరాళాలు అందిస్తున్నారు. Read more about 50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

Please like and share us:
ఎప్పట్నుంచో ఉన్నా.. ఎప్పటికీ ఉంటా..!

ఎప్పట్నుంచో ఉన్నా.. ఎప్పటికీ ఉంటా..!

మాజీ కేంద్ర మంత్రి టి‌డి‌పి సేనియర్ నేత అశోక్ గజపతి రాజు ఎందుకు ఎక్కువగా కనపడట్లేదు. చంద్రబాబు టూర్లలో మీటింగ్ లలో తన ఉనికి ఎందుకు కనబరువట్లేదు. ఎప్పుడూ మహానాడుని ముందుండి నడిపే మాజీ మంత్రి మహానాడుకి ఎందుకు హాజరవ్వలేదు.. గురువారం భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంతోపాటు శనివారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన టి‌డి‌పి పార్టీ పై అలిగారా..? లేదా ఆయన ప్రాభవం తగ్గిందని టీడీపీ అధిష్టానం భావించి ఆయనని పక్కన పెడుతుందా.. అనే ప్రశ్నలు గత కొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి. Read more about ఎప్పట్నుంచో ఉన్నా.. ఎప్పటికీ ఉంటా..!

Please like and share us:
టిడిపిలో కొత్త టెన్ష‌న్‌.

టిడిపిలో కొత్త టెన్ష‌న్‌.

టిడిపిలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఉంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్దులుగా బ‌రిలోకి దిగే వారిలో ఈ ఎఫెక్ట్ ప‌డింది. మంత్రి లోకేశ్ సైతం వ‌చ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే ఇంకా మ‌రి కొంత మంది ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసిన నేప‌ధ్యంలో తిరిగి ఎన్ని స్థానాలు సంపాదించుకుంటాం అనే ఈ కొత్త టెన్ష‌న్ టీడీపీని ఇప్పుడు వెంటాడుతుంది. Read more about టిడిపిలో కొత్త టెన్ష‌న్‌.

Please like and share us:
కారణజన్ముడు.. సంత్ సేవాలాల్ మహారాజ్

కారణజన్ముడు.. సంత్ సేవాలాల్ మహారాజ్

గిరిజనుల ఆరాధ్యదైవం సంతు సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతికి రత్నమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శం కావాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంతు సేవాలాల్ 280 జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డులో అమ్మాగార్డెన్‌లో అధికారికంగా నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన మాట్లాడుతూ తండాలలో సైతం స్వయం పరిపాలన ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని కొనియాడారు. సాంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టినట్లు ప్రకృతిలో మమేకమై ఆ ప్రకృతినే ఆరాధించే గొప్ప సం స్కృతి గిరిజనులు అని కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. గతంలో నిరక్షరాస్యతతో అడవి ప్రాంతాలకే పరిమితమైన గిరిజనులు నేడు అభివృద్ధి చెందుతూ వచ్చారన్నారు. గిరిజన జాతిలో పుట్టి ఎంతో చరిత్ర గాంచిన గొప్ప వ్యక్తి సంతు సేవాలాల్ మహారాజ్ అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుందన్నారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో 45 మంది గిరిజనులు సర్పంచ్‌లుగా గెలుపొందడం అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి గ్రామాలతో పాటు ప్రతి తండాకు పది లక్షల రూపాయలు కేటాయించి ఒక్క రోజులోనే జీఓ జారీ చేసి తండాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ పేదల అభివృద్ధికేనన్నారు.అహింసా మార్గంతో పోరాడి అందరినీ చైతన్యపర్చిన నిజమైన యుగపురుషుడు సంతు సేవాలాల్ మహారాజ్ అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు స్పూర్తిగా అందించాలన్నారు. Read more about కారణజన్ముడు.. సంత్ సేవాలాల్ మహారాజ్

Please like and share us:
కాబోయే మంత్రులు వీరే…?

కాబోయే మంత్రులు వీరే…?

ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. దీంతో కేసీఆర్ క్యాబినెట్‌లో ఎవరుంటారన్న అంశంపై చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై చర్చ సాగుతున్నప్పటకీ.. క్యాబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు కాలేదు. శుక్రవారం సాయంత్రం సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిసిన నేపథ్యంలో ఈ నెల 19న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటన వెలువడింది. ఈటెల రాజెంద‌ర్, త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌,ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు,ప్ర‌శాంత్ రెడ్డి,నిరంజ‌న్ రెడ్డి,జ‌గ‌దీశ్ రెడ్డి, రెడ్యా నాయ‌క్‌, సండ్ర వెంక‌ట వీర‌య్య‌,దాస్యం విన‌య‌భాస్క‌ర్‌తోపాటు గౌడ సామాజ‌క వ‌ర్గానికి చెండిన మాజీ మంత్రి ప‌ద్మారావు లేదా వివేకానంద గౌడ‌కు అవ‌కాశం వుండే అకాశం వుంది. ఇక గ‌త మంత్రి వర్గంలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం లేద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ సారి ఖచ్చితంగా ఒక‌రు లేదా ఇద్ద‌రు మహిళల‌కు చాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన మహిళా నేతల్లో సీనియర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు. ఆ ప్రకారం మహిళ కోటాలో పద్మాదేవేందర్‌రెడ్డి పేరు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక పోతే ఖానాపూర్ నుండి గెలిచిన రేఖా నాయ‌క్ పేరు కూడా విన‌బ‌డుతుంది. అయితే టీఆర్ఎస్ లో ట్రిబుల్ షూట‌ర్‌గా పేరున్న హ‌రీష్ రావు, కేటీఆర్‌ల విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది. కాని హ‌రీష్ రావుని మంత్రివ‌ర్గంలోకి తీసుకుని కేటీఆర్ కి మాత్రం మంత్రి వ‌ర్గంలో చోటు వుండ‌క‌పోవ‌చ్చ‌నే ఉహాగాణాలున్నాయి. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల అనంత‌రం కేటీఆర్‌ని ముఖ్య‌మంత్రిగా చేసే అవ‌కాశం వుందంటున్నారు. Read more about కాబోయే మంత్రులు వీరే…?

Please like and share us:
Social media & sharing icons powered by UltimatelySocial
Facebook
Facebook
Twitter