ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు.. ఇదేదో తికమకగా ఉందనుకుంటున్నారా..? మళ్ళీ ఒకసారి చదవండి..! ఒక తల్లి ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది, ఆ కవలలిద్దరూ వేర్వేరు తండ్రులకి జన్మించిన శిశువులు..! ఇది లాస్ వెగాస్‌లో జరిగిన ఒక వింత కథ.. అవును శాస్త్ర ప్రకారం ఇది సంభవం ఈ పరిణామాన్ని ఆంగ్లం లో ‘ తృపల్ ’ అని అంటారు. ఒక్క గర్భం ఇద్దరి వీర్యం వల్ల ఈ ప్రక్రియ ని ప్రారంభిస్తారు. సరోగసి ద్వారా శిశువు కి జన్మనిచ్చే మహిలలకి ఈ ప్రక్రియ చేస్తారు. Read more about ఒక తల్లి, కవల పిల్లలు, వేర్వేరు తండ్రులు..! …
Category: News
భారత్ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..!
జమ్ముకశ్మీర్ పుల్వామా లోని ఉగ్రవాద దాడి మన దేశన్నే కాకుండ ప్రపంచ దేశాలన్నిటిని కలచివేసింది. 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్ లను బలి తీసుకున్న ఈ ఘటన పై అన్నీ రాష్ట్రాల మంత్రులు సంఘీభావం, సానుబుతి తెలియజేశారు. యువత శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన ని ప్రస్తావిస్తూ అనేక దేశాల మంత్రులు.. ప్రధానులు వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. Read more about భారత్ మాతాకీ జై..! లండన్ నగరం దద్ధరిల్లింది..! …
మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..!
జమ్ముకాశ్మీర్ పుల్వామాన ప్రాంతాన్ని మృత్యు దేవత గుప్పెట్లో పెట్టుకుంది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ఎంత రక్తం చూసినా ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా ఆ ప్రాంతాన్ని వదలట్లేదు. మొన్న జరిగిన ఉగ్రదాడిలో 44 మంది భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. ఈ సంఘటన నుండి ఇంకా కోలుకోలేని పరిస్థితి.. ప్రతీకార వాంఛతో భారత ప్రజలు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు మళ్ళీ జేష్ ఏ మహమ్మద్ తీవ్రవాద సంస్థ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మన నలుగురు జవాన్ల ప్రాణాలు బలి తీసుకున్నారు. Read more about మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..! …
తప్పిన ప్రమాదం
చెన్నై విమానాశ్రయంలో ఓ విమానంకు పెద్ద ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ లంక విమానం టైర్ పేలింది. పెద్ద శబ్ధం రావడంతో విమానంలోని ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు ఎయిర్ లంక విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 142 మంది ప్రయాణికులున్నారు. వారంతా క్షేమంగా బయటపడ్డారు. Read more about తప్పిన ప్రమాదం …
శబాష్..అన్షుల్ సక్సేనా..!
జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 44 మంది జవాన్లు అమరులు కావడంతో.. దేశం లోని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ప్రతి ఒక్కరికికి కడుపు మరిగిపోతుంది. ప్రధాని మోది కూడా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్చ ని ప్రకటించాడు. ఇలా మరిగిపోతున్నాడు మన దేశానికి చెందిన ఒక వెబ్ హ్యాకర్ అతడే అన్షుల్ సక్సేనా. Read more about శబాష్..అన్షుల్ సక్సేనా..! …
టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు
టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపి ప్రభుత్వం టి.టి.డి పాలక మండలి సభ్యుడిగా తిరిగి నియమించినా, ఆయన నిర్దేశించిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి తెలంగాణ ప్రాంతం నుండి మరొకరికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిది. దీంతో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసింది. Read more about టీటీడీ పాలకమండలిలోతెలంగాణవాసికి చోటు …
ప్రేమికుడే కిరాతకుడైతే..!
చట్టంలో ఎన్ని మార్పులు చేసిన మరిన్ని కొత్త చట్టాలు తెచ్చిన అత్యాచారాల్ని ఆపలేకపోతున్నారు! అరికట్టలేకపోతున్నారు! మానభంగాల్ని.. యువతుల పై హత్యలని.. అరికట్టలేకపోతున్నారు. రోజుకో చట్టం రోజుకో అత్యాచారం అన్నట్టుగా మారింది కాలం. Read more about ప్రేమికుడే కిరాతకుడైతే..! …
గుండెపోటుతో ఎఎస్సై మురళి హఠాన్మరణం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పి.వి. మురళి కృష్ణరాజు (55) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. సిఐ సుదాకర్ కథనం ప్రకారం …. ఈ నెల 12న స్థానిక పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరిన మురళి కృష్ణరాజు 13న కోర్టు పనిపై హైదరాబాద్ హైకోర్టుకు వెళ్ళిన అతను గురువారం ఉదయం విధులకు హాజరయ్యారని తెలిపారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో విధులు చేపట్టిన రాజు రాత్రి భోజనం చేసిన అనంతరం స్టేషన్ పై వున్న బ్యారక్‌లో నిద్ర పోయారని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఎస్సై మృతి చెంది వుంటారని సిఐ పేర్కొన్నారు. ఎఎస్సైకి గుండెపోటు వుందని, మళ్ళీ అదే రావడంతో మృతి చెందివుండొచ్చన్నారు. ఆయన బంధువులు, భార్య, సోదరులు శుక్రవారం ఉదయం రావడంతో వారి అంగీకారం మేరకు మృతదేహాన్ని వారికి అప్పగించామని చెప్పారు. పోలీస్‌శాఖ అంబులెన్స్‌లో అతని స్వగృహం మేడ్చల్‌కు పంపినట్లు వివరించారు. జిల్లాలోని రాజంపేట్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న మురళీ కృష్ణ రాజు ఇటీవల పదోన్నతిపై ఎఎస్సైగా విధుల్లో చేరారని ఆయన పేర్కొన్నారు. ఎఎస్సై మృతదేహానికి సిఐ సుధాకర్, ఎస్సై ఉపేందర్ రెడ్డిలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్ ఎఎస్సై మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సంఘం తరపున అంత్యక్రియల కోసం 20 వేల నగదును సిఐ చేతుల మీదుగా అందజేశారు. Read more about గుండెపోటుతో ఎఎస్సై మురళి హఠాన్మరణం …
ఎపి డిఎస్సి ఫలితాలు విడుదల
ఎపిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష మెరిట్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాజమహేంద్రవరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారు. 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించారు. మ్యూజిక్, క్రాఫ్ట్ పోస్టులను తొలిసారిగా భర్తీ చేశామని మంత్రి గంటా తెలిపారు. పరీక్షలోని 136 అభ్యంతరాలను స్వీకరించామని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మే 15న నియామక పత్రాలు అందజేస్తామని, వారికి 10 రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తామని మంత్రి గంటా వెల్లడించారు. Read more about ఎపి డిఎస్సి ఫలితాలు విడుదల …
1 నటుడు 2 రౌడీలు 3 పోలిసులు..జయరామ్ హత్య లో కొత్త ట్విస్ట్‌లు..!
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరిన్ని ట్విస్ట్ లు కోణాలు ఉన్నాయంటు రోజుకో ట్విస్ట్ చొప్పున నిందితుల్ని వెలుగులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. జయరాం హత్యకేసును విచారిస్తున్న తెలంగాణ పోలీసులు మరిన్ని సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ హత్య లో ఒక నటుడు, ఇద్దరు రౌడీ షీటర్లు, ముగ్గురు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టు వెల్లడించారు. Read more about 1 నటుడు 2 రౌడీలు 3 పోలిసులు..జయరామ్ హత్య లో కొత్త ట్విస్ట్‌లు..! …