ఎసిబికి చిక్కిన స‌చివాల‌య‌ ఉద్యోగి

తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగరాజు ఎసిబి అధికారులకు చిక్కాడు. ఎంజిబిఎస్‌ వద్ద ఖమ్మం జిల్లా వాసి నాగలక్ష్మి నుంచి రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా నాగరాజును ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కోసం నాగలక్ష్మి దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ. 1.20 లక్షలు లంచంగా ఇవ్వాలని నాగరాజు డిమాండ్‌ చేశాడు. దీంతో నాగలక్ష్మి ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం ఎసిబి అధికారులు వలపన్ని నాగరాజును పట్టుకున్నారు. లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరమని ఎసిబి అధికారులు హెచ్చరించారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రజలు తమకు సమాచారం అందించాల‌ని వారు కోరారు.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *