వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై వేటు

తెలంగాణలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలపై హైకోర్టులో కేసు నడుస్తుండగా, వాటిని తెరినందుకు కలెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించింది. వికారాబాద్‌ నియోజకర్గానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. కోర్టులో కేసులున్న ఈవీఎంల జోలికి పోవద్దని స్పష్టం చేసింది. కానీ కలెక్టర్‌ జలీల్‌ టెక్నీషియన్ల ఆధ్వర్యంలో ఈవీఎంలను తెరిపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జలీల్‌ను సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.

Go To APTS Breaking News

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *