భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలి?

భర్త,భార్య గురించి –“ఈమె తన తల్లి తండ్రులు,సోదరిసోదరులను విడిచి నా దగ్గరకు వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది?కనుక ఈమెకు ఏ విధమైన కష్టము కలుగనీయరాదు .జీవనం నిమిత్తం తిండి,బట్ట,ఇల్లు,మొదలైన వాటికి లోటుండకూడదు.నా కంటే ఈమెకెక్కువసుఖం లభించాలి”అని భావిస్తూ ఆమె యొక్క పాతివ్రత్య ధర్మ విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి.దానివల్ల ఆమె హద్దులు మీరకపోవడం శ్రేయస్సు పొందటం జరుగుతుంది.

పత్నికి ఎటువంటి భావముండాలంటే –“నేను నా గోత్రము కుటుంబము మొదలైనవి త్యజించి వీరింటికి వచ్చానంటే సముద్రం దాటి ఇప్పుడు ఒడ్డుకి చేరుకొని మునిగిపోకూడదు అంటే నేనంతటి త్యాగం చేసి వచ్చాక ఇప్పుడు నా వల్ల వీరికి దుఃఖం కలగకూడదు.వీరి అవమానము గాని,నిందగాని,తిరస్కారంగాని జరగకూడదు.నా వల్ల వీరికి నిండా మొదలైనవి జరిగితే అది చాల అనుచితమైన విష్యం అవుతుంది.నేనెంత కష్టమైనా అనుభవింతునుగాక,కాని వీరికి మాత్రం కించిత్తైన కష్టం కలుగారాదు” అంటూ ఆమె తన సుఖసంతోషాలు త్యాగం చేసి పతి యొక్క సుఖసంతోషాలు దృష్టిలో ఉంచుకొని ఆయన యొక్క ఇహపర శ్రేయస్సు కోరుకోవాలి.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *