పెనుగొండ

హిందూపురానికి 20కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశంలో విజయనగర రాజులచే నిర్మించబడిన కోట ఉంది.బాబయ్య దుర్గా దగ్గర జరిగే ఉరుసు ఉత్సవం కూడా ప్రాచుర్యం పొందినదే.గ్రామమందు అనేక దేవాలయాలు,కొండపై కోట చూడతగ్గవి.అనంతపురం నుండి 70కి.మీ. దూరంలో పెనుగొండ ఉంది.విజయనగర సామ్రాజ్య ప్రారంభ దశలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారట.అనంతర కాలంలో విజయనగర ప్రభువులు వేసవి విడిదిగా ఉపయోగించినారు.ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూడవలసినది పెనుగొండ ఫారెస్ట్,జె.పి. ప్యాలెస్.ఇంకొక ముఖ్యమైన ఆకర్షణ కుంభకర్ణుడి తోట. ఈ తోట పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణం కలిగి మన మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.ఈ తోటలో 142 అడుగుల పొడవు,32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో వుంటుంది.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *