చంద్రగ్రహ శాంతికి ఏం చేయాలో తెలుసా..!?

చంద్రుడు గౌరవర్ణం కలవాడు. చంద్రుని వస్త్రము, అశ్వము, రథము శ్వేత వర్ణములే. స్వర్ణమకుటము, ముత్యాలహారము ధరిస్తాడు. హస్తగధాయుధుడు. మరో హస్తమున వరముద్రను కలిగియుండును. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, పురుషస్వరూపుడని అందురు.
శ్రీ కృష్ణభగవానుడు జన్మించకముందే జన్మించినవాడు. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడందురు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించియుంటాడు. అత్రి మహర్హి, అనసూయలపుత్రుడు. సర్వమయుడు. బీజ, ఓషధి జలపూరుడు. అశ్విని, భరణి 27మందిని వివాహమాడెను.
వీరు నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మములను పాలిస్తూ… వర్షములను, మాసములను విభజించుచుందురు. పూర్ణిమనాడు చంద్రోదయ సమయమున రాగి పాత్రయందు తేనెకలిపిన పాయసమును వండి, చంద్రునికి సమర్పించిన యెడల శుభపద్రములు జరుగును.
ఇతని వాహనమైన రథములో మూడు చక్రములు మాత్రమే ఉండును. పది అశ్వములు ఇతని రథమున చోటుచేసుకుని వుంటుంది. అశ్వములు దివ్యమైనవి. అశ్వముల నేత్రములు కూడా శ్వేత వర్ణమును కలిగియుండును. మత్స్యపురాణమును పోలిన కంఠమును చంద్రుడు కలిగియుంటాడు.
చంద్రునికి బుధుడు అనేపుత్రుడు కలడు. ఇతడు తారకకు జన్మించిన వాడు. చంద్రునికి అధిదేవత, ప్రత్యధిదేవత గౌరీదేవి. చంద్రుని మహాదశకాలము పది సంవత్సరాలు. చంద్రుడు కర్కాటక రాశి నాథుడు. నక్షత్రములకు స్వామి నాథుడు. నవగ్రహములలో రెండవస్థానానికి చెందిన వాడు. చంద్రశాంతికి సోమవార వ్రతము చేయటం మంచిది.
ఇంకా శివోపాసనం, శివస్తుతి చేయవలెను. వెండి, శంఖము, వంశపాత్ర, తెల్లని చందనము, శెనగలు, శ్వేతపుష్పములు పెరుగు, ముత్యాలు ఎద్దులకు దానమివ్వాలి. ఎద్దును బ్రాహ్మణునికి దానమివ్వడం ద్వారా చంద్రగ్రహ ప్రభావంతో కలిగే దుష్ఫలితాలు దరి చేరవని శాస్త్రం చెబుతోంది.

Go To Bharatiya Sampradayalu

Please like and share us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *